స్టేట్​ దాటనున్న సింగరేణి.. త్వరలో ఒడిశాలో తవ్వకాలు

హైదరాబాద్, వెలుగు :  బొగ్గుగనుల తవ్వకాల్లో వందేండ్ల అనుభవం ఉన్న సింగరేణి ఇకపై స్టేట్​ దాటి బొగ్గు వెలికితీయనుంది. ఇంతకాలం రాష్ట్రంలోని ఆరు సింగరేణి ఏరియాల్లోనే బొగ్గు ఉత్పత్తిని కొనసాగించిన సంస్థ.. మరికొన్ని నెలల్లో ఒడిశాలోని నైనీ బొగ్గుగనుల్లో తన పనులు ప్రారంభించనుంది. వచ్చే సెప్టెంబర్‌‌‌‌లోనే నైనీ కోల్‌‌‌‌బ్లాక్‌‌‌‌లో  నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి టార్గెట్​గా పెట్టుకుంది. నైని బొగ్గుగని ఒడిశాలోని అంగూల్‌‌‌‌ జిల్లాలోని చెండిపడాలో ఉంది. ఈ బ్లాక్​లో  అపారమైన బొగ్గు నిక్షేపాలును సింగరేణి దక్కించుకుంది.

నైనీ బ్లాక్​లో సబ్‌‌‌‌ బిట్యుమినస్‌‌‌‌  రకానికి చెంది బొగ్గు లభించనుంది. అత్యంత నాణ్యమై ఈ  బ్లాక్‌‌‌‌ను సింగరేణి దక్కించుకుంది. ఏటా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ఈ ఓపెన్​కాస్ట్​ మైన్​ను ప్రారంభించనుంది. ఇదే మైన్ లో దాదాపు 340 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి గుర్తించింది. ఈ బ్లాక్‌‌‌‌కు 2021లోనే కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతి ఇచ్చింది. రూ.491 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టగా, ఇప్పటికే  రూ. 491 కోట్లు ఖర్చు అయ్యాయని సింగరేణి వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఈ బొగ్గంతా జైపూర్​ థర్మల్​ ప్లాంట్​కే

బొగ్గు ఉత్పత్తితో పాటు ఇటీవలి కాలంలో సింగరేణి పలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. దీంట్లో భాగంగా కొత్తగా 800 మెగావాట్లతో మరో థర్మల్‌‌‌‌ ప్లాంట్​ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సోలార్‌‌‌‌  విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పుతున్నది. అయితే నైనీ కోల్‌‌‌‌ బ్లాక్‌‌‌‌లో వెలికితీసిన బొగ్గును కేంద్రం ఆదేశాల మేరకు పూర్తిగా సింగరేణి సంస్థ వాడుకోనుంది. సింగరేణి నిర్వహిస్తున్న థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్లల్లో విద్యుత్తు ఉత్పత్తికే ఈ బొగ్గును వాడుకోనున్నారు.

ఇప్పటికే జైపూర్‌‌‌‌లో కొనసాగుతున్న 1200 మెగావాట్లతో పాటు కొత్తగా కట్టే మరో థర్మల్‌‌‌‌  ప్లాంట్​ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త థర్మల్​ ప్లాంట్​కు నైనీ బ్లాక్‌‌‌‌లోని బొగ్గును వినియోగిస్తారు. అలాగే సూపర్​ క్రిటికల్​ థర్మల్​ ప్లాంట్​ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం 2,253 ఎకరాల భూమిని సింగరేణి లీజుకు తీసుకోనుంది. దీంట్లో 1934 ఎకరాల్లో ఫారెస్ట్​ భూములు ఉన్నాయి.. మరో మిగతా భూమి  నాన్​ ఫారెస్ట్​ భూమిని సేకరించాల్సి ఉంది. బొగ్గు రవాణాకు వీలుగా ప్రత్యేక రైల్వే కారిడార్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు.